Na Navve Deepavali

నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి
నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే అతిమధురం నా మనసే
నా నవ్వే
నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి

కనని వినని అనుభవమే ఇదిరా చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
అందాలన్నీ పూచెను నేడే ఆశల కోటా వెలిసెను నేడే
స్నేహం నాది దాహం నీది కొసరే రేయీ నాదే నీది
ఆడి పాడి నువ్వే రా
నా నవ్వే
నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే అతిమధురం నా మనసే
నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి

కడలి అలలు నీ చెలి కోరికలే నా కలల కథలు వణికెను దీపికలై
కడలి అలలు నీ చెలి కోరికలే నా కలల కథలు వణికెను దీపికలై
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం పలికించేను అల్లరి పాఠం
తనువు నాలో రేగే వేళ వయసే బంధం వేసే వేళ
ఆడి పాడి నువ్వే రా
నా నవ్వే
నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే అతిమధురం నా మనసే
నా నవ్వే దీపావళి హోయ్ నా పలుకే గీతాంజలి



Credits
Writer(s): Vennelakanti, Rajaram Shinde Rajashree, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link