Brahma O Brahma

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా
జాబిల్లిలా ఉంది జాణ
ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా

నీలాల ఆ కళ్ళలో నీరెండ దాగున్నదో
ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో
ఆ పాల చెక్కిళ్ళలో మందారమే పూచెనో
ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో
నా గుండె దోసిళ్ళు నిండాలిలే నేడు ఆ నవ్వు మత్యాలతో
ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా

నూరేళ్ళ ఈ జన్మని ఇచ్చింది నువ్వేనని
ఏ పూజలూ రాని నేనంటే నీకెంత ప్రేముందని
ఈ వేళ ఈ హాయిని నా గుండెనే తాకనీ
అందాల ఆ రాణి కౌగిళ్ళలో వాలి జీవించనీ
ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగ దీవించనీ
తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా
జాబిల్లిలా వుంది జాణ
ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా



Credits
Writer(s): Kula Sekhar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link