Saradaga..Chandamaamane

సరదాగా చందమామనే
చేతి వేళ్లపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో
ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని
నింగి మధ్యలో పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో
నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే
ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కోరితే
ఎల్లాగో ఎల్లాగో మరి
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా ఓ
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా ఓ
ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే
చేతి వేళ్లపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో
ప్రేమ పలుకులే పలికిస్తావా

చిగురులతోనే చీరను నేసి
చేతికి అందించవా
కల్వలతోనే అంచులు వేసి
కానుక పంపించనా ఓ
అడిగినదేదో అదే ఇవ్వకుండా
అంతకు మించి అందించేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా ఓ
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా ఓ ఓ
ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే
చేతి వేళ్లపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో
ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని
నింగి మధ్యలో పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో
నిట్టనిలువుగా నిలబడతావా

మెలకువలోన కలలను కన్నా
నిజములు చేస్తావనీ
చిలిపిగా నేనే చినుకౌతున్నా
నీ కల పండాలని ఓ
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే
చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేయివా
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా ఓ
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా ఓ ఓ
ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే
చేతి వేళ్లపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో
ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని
నింగి మధ్యలో పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో
నిట్టనిలువుగా నిలబడతావా



Credits
Writer(s): Ananth Sriram, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link