Poola Megha

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా
ధీమాగ తిరగర మగరాయడా
భామంటె చూడని వ్రతమేలా
పంతాలె చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

చెలితీగకి ఆధరమై బంధమై ఱల్లుకో
దరికొచ్చి ఱరవిచ్చి ఱరవిందమయ్యే ఱందమే ఱందుకో
మునిపంటితో నా పెదవి పై మల్లేలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరెకా నడుము నడిపించికో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
జత లీలలొ ఱలిసి మత్తేక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటీ కోనేట కొలువుండిపోని చెలిమి చంగలువనై
మోజులే జాజులై పూయనీ హయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link