Thika Maka

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీరామ చందురుణ్ణి కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువుచేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషీ
తైదిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిది

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసీ

వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా
క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోన అన్వేషణ
కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూలేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ
తై దిదితై దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ

అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకీ శిరసొంచి దారీయదా
అటువంటిపాదాలు పాదుకలకీ పట్టాభిషేకమే కదా
ఆ రామగాధ నువు రాసుకున్నదె కాదా
అది నేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగులజాడలు చెరపొద్దురా మనిషీ
తై దిది తరికిటతోం తరికిటతోం తరికిటతోం తత్తోం
తికమక మకతిక
తికమక తిక తికమక మకతిక
పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలసీ



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link