Yuddam Yuddam

నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం
(యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం)
ఈ నాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం
(యుద్దం యుద్దం
ఓ, యుద్ధానికి సిద్దం)

ఒక మంచి పని తలకెత్తుకునీ కాగడలతో తలపడదాం
విధివంచితులా తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం
మన సాయం మనమే
మన సైన్యం మనమే
గెలుపొందే దెపుడూ
పోరాడే గుణమే
తడి బారిన చెంపలు తుడిచేద్దం తక్షనమే

(యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం
యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం)

నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

(యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం
యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం)

సై అన్నదీ ధర్మాగ్రహం
సంకల్పమే వజ్రాయుదం
కళ్ళునెత్తి ఎక్కీ నెత్తికెక్కి తొక్కే కండకావరాలు ఎన్నాల్లూ
వొళ్ళు కొవ్వెక్కీ పేద గొంతు నొక్కే అరాచకాలు ఇంక చాలు చాలూ
చలి చీమలన్ని చేరీ విషనాగుల మదమనచాలీ
ఇన్నాళ్ళ దౌర్జన్యాన్నీ నిలదీసి నిరసించాలీ
ఎలుగెత్తే వరకూ
దండెత్తే వరకూ
గుర్తించడు ఎవడు
మన నెత్తుటి ఉడుకూ
నీ ఊపిరికర్దం ఉద్యమమే కడవరకూ

(యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం
యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం)

కన్నీళ్లకూ గొంతున్నది
కష్టాలకూ చెల్ అన్నదీ
బానిసత్వమే నీ పౌరుసత్వమంటూ బలిసినోడు తిప్పితుంటే మీసం
ఈ జన్మకింతే నంటూ ఆ మాటనొప్పుకుంటూ నీకు నువ్వు చేసుకోకు మోసం
పిడికిళ్లు బిగిశాయంటే సంకెల్లు చెల్లా చెదురే
గడి దాటి కదిలారంటే బలహీనులైనా పులులే
భయపడుతూ ఉంటె భయపెడుతున్టారే
పడి ఉంటామంటే పడగై కాటెస్తారే
ఇక తెగబడితే మన జోలికి యెవరూ రారే

(యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం
యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం)
నెడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం
(యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం
యుద్దం యుద్దం
యుద్ధానికి సిద్దం)



Credits
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link