Okkate Aasa

ఒక్కటే ఆశ
అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేశా
పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా
పుచ్చుకో ప్రాణేశా
చుక్కనే చూశా
లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా
కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా
కిందికే దించేశా
ఒక్కటే ఆశ
అందుకో శ్వాస

మెత్తగా ఒళ్ళో పెట్టుకో కాళ్ళూ ఉందిగా అంక పీఠం
ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం
పాద పూజలే ఆది పాఠం
చాకిరీ చెయ్యనా బానిసై నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా నీ జీవితం సార్ధకం పొమ్మిక
మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం
చుక్కనే చూశా
లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా
కిందికే దించేశా
అచ్చగా అంకితం చేశా
పుచ్చుకో ప్రాణేశా
ఒక్కటే ఆశ
అందుకో శ్వాస

నచ్చెనే నారి, వచ్చెనే కోరి, తెచ్చెనే ప్రేమ సౌఖ్యం
సాటి లేనిది ఇంటి సఖ్యం
మెచ్చెనే చేరి, ముచ్చటే తీరి, ఇచ్చెనే ప్రేమ రాజ్యం
అంతులేనిదే సంతోషం
స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వమూ పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరి, ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం
ఒక్కటే ఆశ
అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేశా
పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేశా
కిందికే దించేశా
ఒక్కటే ఆశ
అందుకో శ్వాస



Credits
Writer(s): Vennelakanti, Sirivennela Sitarama Sastry, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link