Arerey Manasa

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనకే నడిచే
తోడొకటుంది కలిసా

తెలియదే అడగడం
ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా

ఆ' నా బ్రతుకున ఏ రోజో
ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే
కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్ళుగ నా వెనకున్నది
నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన
తోడే నువ్వే
ఆ' ఊరంతా మహరాజైనా
నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే...

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా

నేనడిగిన రాగాలు
నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు
నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి
ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది
నా వేకువలే
ఆ' ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా



Credits
Writer(s): Vivek Sagar, Ravi Krishna Vissapragada
Lyrics powered by www.musixmatch.com

Link