Telisiney Na Nuvvey

साला दिल -
फालतू

తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే
నీ నేను కానని

నాలో సగం ఇక లేదు అని
నా నిన్నలే నను చూసి నవ్వెలే

మరునాడు అన్నదే
ఇక ఉండబోదని
అన్నది-ఈ క్షణం

నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే
గుండెల్లో మండే
నిప్పై చేరావే

ఊహాలకే తెలియనిదే
జరిగెనులే ఇపుడెలా
నువ్వు నేను అను మాటే ఇకపై
ఉండదులే ఏంటిలా

తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే

నువ్వు లేనిదే
మరి నేను లేనని
అన్నది-ఈ క్షణం

నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత

నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత

This is what you wanna see me, why?
Lady, you know how it feels me, ahh
Day and Night, All the time, Everyday
Killing myself, My lady you know
I lost my world, somehow you know where is it
I'm dying all the day, Losing my patience down
Can anyone just tell me "Who am I?"
Better kill me, I don't need this shit

తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే
నీ నేను కానని



Credits
Writer(s): Rambabu Gosala, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link