Oopiri Aaguthunnadey

ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా

తెంచలేని సంకెలై నీ తలపే వదలదే
కంచె లేని కాంక్షలే ఇక కొంచమైపోయే

ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
కనులే మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా

నా అడుగులే పడే తడబాటుగా
ఏ తీరం చేరునో ఈ పయణమే
పొరపాటే చేసిందే
విడదీసి ఈ కాలం నిన్ను నన్ను

ఎందుకీ ఎదలో వింత కలకలమే
వచ్చి వాలేనో నేడిలా
వేదనే ఇంత సొంతమయ్యేనా
వదిలిపోదేమో నీడలా

ఆపే వీలేది లేనేలేదేమో
అంత మాయైన దారిలో
కాలం ఈ కథనే నడిపిందేమోలే
ఏమో ఇది మరణమేనేమో

మౌనాలు శూన్యాలు
కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను



Credits
Writer(s): Rambabu Gosala, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link