Naalo Maimarapu

నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా
నాలో
నాకే
ఏదో
తడబాటే

పాతపూల గాలే పాడుతుంటే లాలే
కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే
చందమామ జారి చెలిమిలాగ మారి
గోరుముద్ద నాకే పెట్టినట్టు ఉందే

నన్ను గారం చేసే బాటసారి, ఎవరివోయి?
నేను మారాం చేస్తే నవ్వుతావు, ఎందుకోయి?
నా స్వరం నన్నే కొత్తగా ఓయ్ అని పిలిచే తరుణం
ఇలా ఈ క్షణం శిలై మారితే లిఖించాలి ఈ జ్ఞాపకం
నువ్వు నన్ను చూసే చూపు నచ్చుతోంది
నెమలి పించమల్లె నన్ను తాకుతోంది
తేలికైన భారం, దగ్గరైన దూరం
సాగినంత కాలం సాగనీ ప్రయాణం

దాచిపెట్టే నవ్వే కళ్ళలోనే తొంగి చూసే
సిగ్గు మొగ్గైపోయే గుండెలోనే పూలు పూసే
నా ముఖం నాకే ముద్ధుగా చూపెనే గదిలో అద్దం
నిజంగా ఇది భలేగున్నది, ఈ తైతక్క నాకెందుకు?

ఆశలన్నీ మళ్ళీ పూస గుచ్చుతుంటే
ఉన్నపాటు నేనే తుళ్ళిపడుతూ ఉన్నా
వయసు నన్ను గిల్లి, కాస్త ముందుకెళ్ళి
ఊసులాడబోతే ఎందుకాపుతున్నా



Credits
Writer(s): Bhaskarabhatla, Mickey J. Meyer
Lyrics powered by www.musixmatch.com

Link