Maha Adhbhutham

మహా అద్భుతం కదా
అదే జీవితం కదా
చినుకు చిగురు కలువ కొలను
అన్నీ నువ్వేలే
అలలు, శిలలు, కలలు, తెరలు
ఏవైనా నువ్వేలే
ప్రశ్న, బదులు, హాయి, దిగులు
అన్నీ నీలోనే
నువు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే
నువు తెరిస్తే ప్రతి రోజూ
రాదా వాసంతం
ఆనందాల చడీ చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడూ
గుర్తే పట్టక గుక్కే పెడితే
లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు
చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే

ఓ కాలమే నేస్తమై
నయం చేస్తుందే గాయాల గతాన్ని ఓహొహో
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి
సంతోషాల తీరం పోదాం
భయం దేనికి
పడుతూ లేచే అలలే కాదా
నీకే ఆదర్శం
ఉరుమో మెరుపో ఎదురే పడని
పరుగాపకు నీ పయనం
తీపి కావాలంటే చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో
ఎంతో ఇష్టంగా
కళ్లే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలలోనైన చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఉందాం ఒకరికి ఒకరుగా

కళ్లే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలలోనైన చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఉందాం ఒకరికి ఒకరుగా

(కళ్లే తడవని విషాదాలని)
(కాళ్లే తడపని సముద్రాలని)
(కలలోనైన చూసేటందుకు వీలుంటుందా)
(చుట్టం చూపుగ వచ్చామందరం)
(మూటే గట్టుకు పోయేదెవ్వరం)
(ఉన్నన్నాళ్లూ ఉందాం ఒకరికి ఒకరుగా)



Credits
Writer(s): Bhaskarabhatla, Mickey J. Meyer
Lyrics powered by www.musixmatch.com

Link