Jampanduve

జాంపండువే దోర జాంపండువే
పూచెండువే మల్లె పూచెండువే
నీపాల బుగ్గ ఎర్రమొగ్గలేసే నా మనసున తైతక్క
రవి చూడని రవికని చూస్తే నా వయసుకు తలతిక్క
జాంపండునే దోర జాంపండునే
పూచెండునే మల్లె పూచెండునే

ఊగింది ఉగింది నా మనసు ఊగింది
నీ కంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో, అవి ఏం కిటుకులో
ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది
నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో, అవి ఏం మెలికలో
ఇది పంచదార చిలక అంచులన్నీ కొరక మీదికొచ్చి వాలమాక
ఓ చందనాల చినుక, కుందనాల మొలక కోకడాబు కొట్టమాక
నువ్వే నేనుగా తిరిగాం జంటగా
నిప్పే లేదుగా రగిలాం మంటగా
జాంపండునే దోర జాంపండునే
పూచెండువే మల్లె పూచెండువే

ఒళ్ళంత తుళ్ళింతై చెమటెంత పడుతున్నా
ఆ చెమట చేరని చోటు చూపించవే అది చూపించవే
కళ్ళంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా
ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే తొణికే పెదవులే
నువ్వు ఆడసోకు చూపి ఈడ కొంత కుర్రగుండె కోయమాక
నన్ను కౌగిలింతలాడగ కచ్చికొద్ది కొరక కన్నెసైగ కోరమాక
మరుగే ఉందిగా చొరవే చేయగా
తరుగే పోదుగా ఒడిలో చేరగా
జాంపండువే దోర జాంపండువే
పూచెండువే మల్లె పూచెండువే
నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నీ మనసున తైతక్క
రవి చూడని రవికని చూస్తే నీ వయసుకు తలతిక్క
జాంపండువే దోర జాంపండువే
పూచెండువే మల్లె పూచెండువే



Credits
Writer(s): Veturi Murthy, S A Rajkumar
Lyrics powered by www.musixmatch.com

Link