Gunde Gutiki

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది
గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది

నేలనొదిలిన గాలి పరుగున
ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను
వేగంగా చేయాలి
నా ఇంటి గడపకి మింటి మెరుపుల
తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి
స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో
ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది

బావ మమతల భావకవితలే
శుభలేఖలు కావాలి
బ్రహ్మ కలిపిన జన్మముడులకు
సుముహూర్తం రావాలి
మా ఏడు అడుగుల జోడు నడకలు
ఊరంతా చూడాలి
వేలు విడువని తోడు ఇమ్మని
అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళూ
ఇన్నాళ్ళూ ఎదురుచూసే నా ఆశలరాజ్యంలో
రాణిని తీసుకువచ్చే కలకల కనపడగా

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది



Credits
Writer(s): Sitaram Sastry, S.v. Krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link