Brahmalu Guru Brahmalu

బ్రహ్మలు గురు బ్రహ్మలు
గానాంమృత రసవిదులు కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులు
భువిలో వెలసిన సురవరులు
బ్రహ్మలు గురు బ్రహ్మలు
గానాంమృత రసవిదులు కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులు
భువిలో వెలసిన సురవరులు

వేదమూర్తులై నాద యోగ సాధకులై
పరమొకటే కోరుకున్న ఆ స్వర ధనులెవరో
తెలసి తలచి నా ఉపాధికై రాగ భావ జాలనలో
గతినిడిచీ పాడుకున్న నా అభినవ జతినే
వలచి మలచి తీశానులే కొత్త రాగమే
వేశానులే ఆది తాళమే
పదము నాకు మనుగడకాగా లయలు జతులు క్రియలు ప్రియముకాగా
జగతినెరిగి సుగమగతులనడిగే
బ్రహ్మలు గురు బ్రహ్మలు
గానాంమృత రసవిదులు కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులు
భువిలో వెలసిన సురవరులు

త్యాగబ్రహ్మము తాళ్ళపాక అన్నమయా
జపియించే భక్తి భావన సురభిళకృతులే
తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే
గమనించి నవ్యరీతిలో గమకపు లయతో
కలిసి మెలిసి సాగేనులే బాటసారిగా
సంగీతమే జీవనాడిగా
తెలుగు పాట జగతికి చాట చిలిపి వలపు కలిపి పదము పాడా
మనసు నిలిపి మధుర జతుల తేలే
బ్రహ్మలు గురు బ్రహ్మలు
గానాంమృత రసవిదులు కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులు
భువిలో వెలసిన సురవరులు
సనిపమ నిపమని రిగరిస
సనిపని సనిపమ పనిపమ రిగరిస
నిసరిగరి నిసరిమప సరిమపని
సరిమపప రిమపనిప మప నిసరిస రిసనిపనిస సనిపదనిప
పమరిగరిస నిసరిమ నిసరిమప రిమపని రిమపనిస మపనిస మపనిసరిస



Credits
Writer(s): Veturi, S.v. Krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link