Arere Chandrakala

ఘల్లున ఘల్లున
నందన నందన
ఘల్లున ఘల్లున
నందన నందన

అరెరే చంద్రకళ జారెనా కిందికిలా
అందుకేనేమో ఇలా గుండెలో పొంగే అల
రెప్పలో ఉన్న కల చేరెనా చెంతకిలా
కనకే కన్నులలా మెరిసే మిల-మిల
ఏ కైపు వల నిన్నాపెనలా
చిత్రంగ అలా చూస్తుంటే ఎలా
ఓ వెల్లువలా ముంచేత్తవెలా
ఆ వరదలనే కరిగించెేలా
హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో
పొమ్మని పొమ్మని తరిమెయ్ దూరాన్ని
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
బొమ్మవి కమ్మని కసిరెయ్ కాలన్ని

సౌందర్యమా... ఒప్పుకో సర్లే అని
ఎందుకు అన్నానా సంగతి ఏదైనా
సందేహమా... వదిలేయ్ చిన్నారిని
సిగ్గులు పొమ్మన్నా సిద్ధపడే ఉన్నా
తడబాటు నిజం బిడియం సహజం
ఇష్టానికదో తియ్యని దాఖలా
నా బేలగుణం నీ పెంకితనం
చూస్తుంది కదా దాస్తావేలా
హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో
పొమ్మని పొమ్మని తరిమెయ్ దూరాన్ని
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
బొమ్మవి కమ్మని కసిరెయ్ కాలన్ని

ఏం చెయ్యనే... మహ ముద్దొచ్చావని
మక్కువ ముదిరిందా తిక్కగ తరిమిందా
ఏం చెప్పనే... తట్టుకోలేనే అని
ఎందుకులే నింద ముందుకురా ముకుందా
గుట్టొదులుకొని గట్టెక్కమని లాగొచ్చుకదా నువ్వే నన్నిలా
అకట్టుకొని చేపట్టమని పనిగట్టుకొని ప్రకటించాలా



Credits
Writer(s): Vishal Lalit Jain, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link