Anitha 2

నన్ను నేనే మరిచా
నీ నీడై నడిచా
ఇది కలేం కాదు మానస
నన్ను నీలో విడిచ
నిన్ను నాలో దాచ
ఈ నిజం నీకో తెలుసా
గాలి వాన రెండు కలిసి వచ్చే ముందు
అచ్చం నీలా ఉంటుందమ్మా వెలుగు
చీకటి చంపే నీ మెరుపు

ఓ అనిత నా అనిత
గుండెలో పొంగే కవిత
సాగిందే నదిలాగే వేగంగా
ఓ అనిత నా అనిత
కనుగురా ఎదో వింత
మోగిందే రాగంలా మనసంతా

నా మదే చెడి నిలిచివున్న
నీ జోతే చెలి కోరుతున్న
నీ కలై అలై ముంచుతున్న
I like you అని కనులు తెలిపెను
I love you అని పెదవి పలికెను
నీ ఈ మాటకై ఎదురు చూస్తున్న

కళ్ళలో నిదరకు చోటే కరువయిందమ్మా
నిన్నలో నేనీ వైనం ఎరగనులేమ్మా
రేయికి పగలుకు తేడా తెలియక బొమ్మ
ప్రేమలో నిలువునా మునిగి పోయెను జన్మ
నా సొంతంలా రావే వాసంతంలా
సంగీతంలా ఎదకే సంకేతంలా
జతగా నిలబడు ఈ క్షణమే

ఓ అనిత నా అనిత
గుండెలో పొంగే కవిత
సాగిందే నదిలాగే వేగంగా
ఓ అనిత నా అనిత
కనుగురా ఎదో వింత
మోగిందే రాగంలా మనసంతా

మెదడుని మెలిపెడుతున్నది నీ ఊహేమ్మ
గడిచిన ఇరవై ఏళ్లలో ఇది లేదమ్మా
తెలుగులో కొత్తగా విన్నది నీపేరేమ్మ
అమృతం కన్నా తీపిని మించిందమ్మా
నింగి నెల కలిసే చోటే లేదు
నువ్వు నేను కలవక ప్రేమే లేదు
ప్రాణం పలికిన తోలి పలుకు

ఓ అనిత నా అనిత
గుండెలో పొంగే కవిత
సాగిందే నదిలాగే వేగంగా
ఓ అనిత నా అనిత
కనుగురా ఎదో వింత
మోగిందే రాగంలా మనసంతా



Credits
Writer(s): Sai Karthik, Surendhra Mittapalli
Lyrics powered by www.musixmatch.com

Link