Anitha O Anitha

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనితా అనితా
అనితా ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
కలలోకూడ నీ రూపం నను కలవరపరిచెనే
కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వొక చోట, నేనొక చోట
నిను చూడకుండ నే క్షణముండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే
నా ఆశలరాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే
అనితా అనితా
అనితా ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా

నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా
ప్రతిక్షణమూ ధ్యానిస్తూ పసిపాపలా చూస్తా
విసుగురాని నా హృదయం నీ పిలుపుకై ఎదురుచూసే
నిను పొందని ఈ జన్మే నాకెందుకనంటుందే
కరుణిస్తావో కాటేస్తావో
నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
ననువీడని నీడవు నీవే, ప్రతిజన్మకు తోడువు నీవే
నా కమ్మనికలలు కూల్చి నను ఒంటరివాడ్ని చేయకే
అనితా అనితా
అనితా ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనితా అనితా
అనితా ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన

ఏదోరోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే
ఒక చిన్నిఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా
అనితా అనితా
అనితా ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన



Credits
Writer(s): Sai Karthik, Nagaraju
Lyrics powered by www.musixmatch.com

Link