Velugurekhalavaru

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగా
చిలకాముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా
మనువలనెత్తే తాత మనువాడ వచ్చాడు మందారపువ్వంటి మా బామ్మని
అమ్మమ్మని

నోమీనొమ్మల్లాలో నోమన్న లాలో సందమామ సందమామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందమామ సందమామ
పండంటి ముత్తైదు సందమామ పసుపుబొట్టంత మా తాత సందమామ
నోమీనొమ్మల్లాలో నోమన్న లాలో సందమామ సందమామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందమామ సందమామ

కూచను చెరిగే చేతికురులపై తుమ్మెదలాడే ఓలాల.
తుమ్మెదలాడే ఓలాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాల.
గాజులు పాడే ఓలాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా.
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఈ లాల
ఏలాలో ఏలాల ఏలాలో ఏలాల
దివిటీల సుక్కల్లో దివినేలు మామ సందమామ సందమామ
గగనాల రథమెక్కి దిగివచ్చి దీవించు సందమామ సందమామ
నోమీనొమ్మల్లాలో నోమన్న లాలో సందమామ సందమామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందమామ సందమామ

ఆపైన ఏముంది ఆమూల గదిలోన
ఆరుతరముల నాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమేపించే మీ తాత వంశం
అరవై ఏళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవయ్యేళ్ళ వాడు మీ రాముడైతే పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంతా ముత్తైదు జన్మ పసుపుకుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ
ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనేమా నానమ్మ పెళ్ళికూతురాయెనే



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link