Kukkuteshwara Kunuku

కుక్కుటేశ్వరా కునుకు సాలురా
నీవు లేవరా... నిదర లేపరా
కుక్కుటేశ్వరా కునుకు సాలురా
నీవు లేవరా... నిదర లేపరా
కొక్కొరొక్కో మేలుకో
కొక్కొరొక్కో మేలుకో
కుక్కుటేశ్వరా కునుకు సాలురా
నీవు లేవరా... నిదర లేపరా

ఆటిను, ఇస్పేడ్, diamond, రాణుల అలక తీర్చరా అప్పు చేసి
Coffee, cigarette, ఉప్మా, పెసరెట్టు పరువు పెంచర పద్దు రాసి
సిగ్గు, శరములు గాలికి వదిలి క్లబ్బుకు కదలగ లెమ్మి ఇక లెమ్మి
రమ్మి ఇటు రమ్మి నిను నీవే చేయగా దొమ్మి
నీ కనులకు పొరలే కమ్మి సాటి ఆటకులనమ్మి
నాటి ఆస్తి తెగనమ్మి
ఢంకా పలాసుగ కుంకా కులాసగ
కొ కొ కొ కొ కొ కొ కొ కొ కొక్కొరొక్కో మేలుకో... మేలుకో
కుక్కుటేశ్వరా కునుకు సాలురా
నీవు లేవరా... నిదర లేపరా

మదు దేవి గుడి తలుపు తెరిసేటి ఏళాయె
నిదర ఈర ఇంక మేలుకో
పానకాల సామి పూనకేశ్వరి తోన ఊరేగు ఏళాయె మేలుకో
గోళి సోడా బుడ్డి కెవ్వుమంటున్నాది జాలి చూపి సామి మేలుకో
బారులో దేశీ, విదేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో
తిన్నదరిగేదాక దున్నతో మారాజు కుడితి తాగుదువు మేలుకో
మేలుకో మేలుకో మేలుకో కొక్కొరొక్కో మేలుకో

అల్లరెందుకు రారా నల్ల గోపాలా
చిందులాపర సామి సిన్ని గోవిందా

అల్లరెందుకు రారా నల్ల గోపాలా
చిందులాపర సామి సిన్ని గోవిందా

అమ్మ కడుపే సల్లగా మాయమ్మ వలపే వెన్నగా
రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా

నలుగు పెట్టే ఏళ అలకల్లు ముద్దు
సమురు పెట్టే సేయి దరువుల్లు ముద్దు

నలుగెట్టిన పిండి నాకు గణపతిగా
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా
తల అంటు పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట

రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక

సీలచ్చి దోచింది నీ చేతి ఎముక

నీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక

తీర్చలేని ఋణము తీర్చుకోమనక



Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link