Taanu Nenu (From "Saahasam Swaasaga Saagipo")

తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను

శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మేను

దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను

తాను నేను
(తాను నేను)
మొయిలు మిన్ను
తాను నేను
(తాను నేను)
కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను
(తాను)
ప్రాయం తమకం

తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే
(తాను నేను)
నిశినే నేను
కుసుమం తావి
(తాను నేను)
తాను నేను
వెలుగు దివ్వె
(తాను నేను)
తెలుగు తీపి

తాను నేను
(తాను నేను)
మనసు మేను
మనసు మేను, మనసు మేను
మనసు మేను
(తాను)



Credits
Writer(s): Ananth Sriram, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link