Gore Gore (From "Kick")

గోరే గోరే గొగోరే గోరే గోరే గోరే గొగోరే
గోరే గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే
(గో గో గో గో గో గో)
పో పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
పో పో పొమ్మంటొందా
నను రా రా రమ్మంటొందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
చూస్తూ చూస్తూ సుడిగాలల్లే
చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
ఊపిరి ఆడక నీవల్ల
ఇదరా అదరా ఎద ఏమన్నా
తెలిసే వీలుందా
గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే
గోరే గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే

తెగ ఉరుముతు కలకాలం
తెర మరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం
తెగ ఉరుముతు కలకాలం
తెర మరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం
ముళ్ళుగా నాటితే నీ వ్యవహారం
తుల్లి పడదా నా సుకుమారం
మెల్లగ మీటితే నాలో మారాం
పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం
నేరం నాదా
గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే
గోరే గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే
Yo girl my love is true
Just don't leave me alone yo

గోరే గో గోరే గో if you won't be mine
గోరే గో గోరే గో if you won't be mine

వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైనా చెప్పవే సమయం
వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైనా చెప్పవే సమయం
నీతో నీకే నిత్యం యుద్దం
ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం
ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా

గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే
గోరే గోరే గొగోరే గోరే గోరే గొగోరే గొగోరే



Credits
Writer(s): S Thaman, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link