Evaro Athanevvaro

ఎవరో అతనెవ్వరో అతిథిగా వచ్చాడు
నిదరే పోతున్న నా యదనే కదిపాడు
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది
తెలవారే వేళా కలగన్నా తననే
అది ప్రేమో ఏమో ఏమిటో

ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

అణువణువు అతని తలపై ఏతించ సాగె
అనుదినము వినని కథలే వినిపించేనే
చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె
తొలివలపో జతకు పిలుపో బదులే రాదే
మనసంటే నేరం మనసంటే భారం
నిలిచేనా ప్రాణం ఒంటిగా

ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది
ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే
పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే
ప్రతి నిమిషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే
జతకలిసే అతని కొరకే ఎదురే చూసి
హృదయంలో దాహం తడిపే ఓ మేఘం
ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా

ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
తెలవారే వేళా కలగన్నా తననే
అది ప్రేమో ఏమో ఏమిటో



Credits
Writer(s): Veturi Murthy, Devi Sri G
Lyrics powered by www.musixmatch.com

Link