Yentha Nerchina

ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
నెచ్చెలి నడకే మదగజగమనం
ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
విచ్చిన నగవే మెరిసిన గగనం
రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమనె

ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
నెచ్చెలి నడకే మదగజగమనం
ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
విచ్చిన నగవే మెరిసిన గగనం

చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా
చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా
ఓపలేని ఓ మౌనగీతం రాగం తీయగా
నందనాల నవ పారిజాతం ఇలకే జారగా
ఊహలు గీచిన బొమ్మకు ఊపిరి వచ్చిన వెచ్చని కలలు విరిసి కలిసెను జత

ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
నెచ్చెలి నడకే మదగజగమనం
ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
విచ్చిన నగవే మెరిసిన గగనం

నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక
నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక
ఆలపించే అనురాగ వీణ పలికే గీతిక
రేగిపోయే విరహాలలోన కొసరే కోరిక
అంచులు కలిసిన సంధ్యలు చిందిన కుంకుమ వన్నెలు పెదవి కొసల చిలికెను చెలి

ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
నెచ్చెలి నడకే మదగజగమనం
ఝుం తన నన నన నన నన నన నన నన తకఝం
విచ్చిన నగవే మెరిసిన గగనం
రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమనె



Credits
Writer(s): Balasubrahmanyam S P
Lyrics powered by www.musixmatch.com

Link