Kalyana Vybhogame

విడిపోము మనమూ
ఈ ఎడబాటు క్షణమూ
ఆ పైన కళ్యాణము... ఊఊ ఊఉ

కళ్యాణ వైభోగమే... కళ్యాణ వైభోగమే
శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే... కళ్యాణ వైభోగమే

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము

కళ్యాణ వైభోగమే...

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా
కళ్యాణ వైభోగమే

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
ఆఆ ఆఆ ఆఆ ఆ
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణ వైభోగమే... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే



Credits
Writer(s): Sundara Ramamurthy Veturi, Mahadevan K V
Lyrics powered by www.musixmatch.com

Link