Padipoya

ఓ మెరుపల్లే మెరిసి
ఉరుమల్లే ఉరిమి
వానల్లే కురిసావే
నిజామా లేదా కలా
ఓ గొడుగల్లే తడిసి
వరదల్లే ఉరికి
నీలోకే దూకానే నాలోంచి
నేనే ఇలా
కళ్ళతోటి కళ్ళకి ఎన్ని
చూపు లేఖలో
గుండెతోటి గుండెకెన్ని మౌనభాషలో
పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

నెలవంకై వెలిగిందే
నీ పెదవులపై చిరునవ్వు
ఆ వంకే చాలు కదా
నను నీతో రానివ్వు
చలిమంటై తరిమిందే
నీ వెచ్చని ఊపిరి నావైపు
అది మొదలు నీకోసం
రోజూ పడిగాపు
కోలకళ్ల చిన్న కోనేట్లోన
రంగు చేపలాగ ఈదానే
అందమంటూ ఉన్న చెంపల్లోన
దోరసిగ్గు లాగ నేను మారానే
పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

ఎంతైనా పొగడొచ్చే నిను చెక్కిన
దేవుడి శిల్పకళ
ప్రాణాలే ఇవ్వొచ్చే నీకే కానుకలా
భద్రంగా దాచొచ్చే నిను రంగుల
బొమ్మల సూచికలా
మురిపంగా చదవొచ్చే రోజు రోజు ఆలా
గాలికూగుతున్న ముంగురులేమో
కొంటె సైగలే చేస్తుంటే
నిన్ను హత్తుకున్న అత్తరులేమో
గుప్పుమంటూ గుండె వీడి పోతుంటే
పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో



Credits
Writer(s): Bhaskarabhatla, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link