Boyavani Vetaku (From "Rowdigari Pellam")

బోయవాని వేటుకు గాయపడిన కోయిల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండె కోత కోసిన చేసినావు ఊయల

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది
ఆడతోడు ఉంటానని మూడుముళ్ళు వేయమంది
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి
రాక్షషుణ్ణి మనిషి చేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈ బంధం

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టని
కరుణ చిందు కనులకు కాటుకైన దిద్దని
మెట్టెనింటి లక్ష్మికి మెట్టె నన్ను తొడగని
కాబోయే తల్లికి గాజులైన వేయని
ఇల్లాలికిదే సీమంతం

బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండె కోత కోసిన చేసినావు ఊయల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల



Credits
Writer(s): Bappi Lahiri, Gurucharan
Lyrics powered by www.musixmatch.com

Link