Aa Poola Rangu (From "Dong Police")

ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో
అనురాగాల వాకిళ్ళలో

ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే నీ దాననౌతానులే మరి నీలోని గీతాన్నిలే

(సరి సరి గరిగపద
సరి సరి గరిగపద)

పుసుపుగ విరిసిన పూవులు
తలపై కురిసెను పలికెను
ఉండాలనీ పచ్చగా
ఎర్రగ విరిసిన పూవులు
ఎదపై కురిసెను పలికెను
ఉండాలనీ ప్రేమతో
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే నీకాళ్ళపారాణిగా
నా కళ్ళలో రాణిగా
నా కళ్ళలో రాణిగా

ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

కలిసిన కనులకే తెలియును
వలపుల మలుపుల సొగసులు
ఏ ప్రేమబంధాలివో
నడిచిన అడుగులే కలుపును
మనుసును మనసును ఒకటిగా
ఏ రాగబంధాలివో
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై
అందానికే మూలమై
అందానికే మూలమై

ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే
రాగాల లోగిళ్లలో
అనురాగాల వాకిళ్ళలో



Credits
Writer(s): Bappi Lahiri, Rasaraju
Lyrics powered by www.musixmatch.com

Link