Silakaa

సిలకా ఎగిరిపోయావా
ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
సిలకా చిన్నబోయిందే
సిట్టి గుండె పిట్ట నువ్వు లేకా
బంగారు సిలకమ్మో ఈ అలక దేనికమ్మో
ఈ అల్లిబిల్లి ఆటలింక ఆపవమ్మో
గుండెను తప్పుజారి పండనుకున్నవేమో
ఇంకెంత కొరుకుతావే జాలి చూపవమ్మో

సిలకా ఎగిరిపోయావా
ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
ఏ హేహే సిలకా ఎగిరిపోయావా ఏ
నిన్నమొన్న దాక కులుకులాడినావే
ఇంతలోనే ఎట్ట జారిపోయినావే
నువ్వు గుర్తుకొచ్చి quarter ఏసినానే
మాటలాడలేక పాట రాసినానే
ప్రేమలోన నేను దేవదాసు
గుళ్లు కట్టలేని రామదాసు

హేయ్ పాట రాసుకొచ్చ first class-u
పాడమంటే అవ్త యేసుదాసు
ఒక్క chance ఇచ్చి నాకు చూడవే
ఇంకో chance అడిగితే చెప్పు తియ్వే
నిన్ను విడిచి అస్సలుండలేనే
మిన్ను విరిగి మీద పడ్డ వదల నిన్నే
Cool down my boy

సిలకా ఎగిరిపోయావా
ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
చెలియో చెల్లకో అత్త తెచ్చిన
కొత్త చీర నచ్చకో
బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నదో
వాడపల్లి రేవు పుంతల్లో చూశా
సింగరాయికొండ జాతర్లో వెతికా
హైదరాబాద్ పోయి మైత్రివనం centerలో
Love missing అని Pamphlets పంచా
తొందరేం లేదు time తీసుకొని
ఓలా ఎక్కి రావే నీలవేణి
ఒక్కసారి నిన్ను చూసుకొని
ఎన్నిసార్లైనా సచ్చిపోనీ
కూనవరం కోనలోకి పోదామే
గోరువంకలల్లే జంట కడదామే
రెల్లు పాకలు అల్లుకొని వెచ్చగా
మళ్లి మళ్లి ఒక్కటైపోదామే
సిలకా ఏ హే సిలకా
సిలకా ఎక్కడున్నాగాని గూటికొచ్చి
వాలిపోవే సాలికా
సిలకా సిన్నబోయిందే
చిట్టి గుండె పిట్ట నువ్వు లేకా

రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ



Credits
Writer(s): Ram Miriyala, Anand Gurram
Lyrics powered by www.musixmatch.com

Link