Kalyanam

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపావె పందిళ్లల్లో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతాలలో
సాగేటి సంబరాలో
కొయిలాలో రామ సిలకలాలో
పలకండి మంతరాలొ

కళ్యాణం కమనీయం
ఒకటయ్యే వేళనా వైభోగం
కళ్యాణం కమనీయం
ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్లట ముడి పడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కుల కంట
చూడ ముచ్చటైన వేడుకంట
ఆ పంచభూతాల తోడుగా
ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాల నిండుగా
ఇది నూరేళ్ళ పచ్చని పంట

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
ఇంటి పేరు మారె ఈ తంతులో
చుక్కలే అక్షింతలో
మోగేటి సన్నాయి మోతాలలో
సాగేటి సంబరాలో
పలకరించే తడి ఓ లీలలో పుట్టినింట కళ్ళలో

ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడూ జన్మలా బంధగా
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
మీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెల
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది అంకెల్లో సంసారమిలా
పదిలంగా సాగేటి అల
ఒక్కటయ్యేనంట ప్రాణం
ఒకరంటే ఇంకొకరి లోకం
ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపావె పందిళ్లల్లో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతాలలో
సాగేటి సంబరాలో
కొయిలాలో రామ సిలకలాలో
పలకండి మంతరాలొ
అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపావె పందిళ్లల్లో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతాలలో
సాగేటి సంబరాలో
కొయిలాలో రామ సిలకలాలో
పలకండి మంతరాలొ



Credits
Writer(s): Kasarla Shyam, Ram Miriyala
Lyrics powered by www.musixmatch.com

Link