Nuvve Na Dhairyam

నేనేంటో నాకు తెలిపి
నను నడిపిన వెలుగే నువ్వే
నా కల ఒక నిజముగా చూసిన స్నేహమే నువ్వే
నా అడుగులు ఎటు వెయ్యాలో
చూపించిన దారే నువ్వే
నా గెలుపుని ముందే చూసిన ప్రేమవే నువ్వే
నా గుండెలోని మాటలన్నీ
పాటలాగా మార్చింది నువ్వే
ఏ అర్ధం లేని పుస్తకాన్ని
నాకంటూ అర్థం ఉందని చెప్పింది నువ్వే

నువ్వే నా ధైర్యం
నువ్వే నా సైన్యం
నువ్వే నా ధైర్యం
నువ్వే నా సైన్యం

నీ పరిచయం
పరిచయం చేసింది నాకు చిరునవ్వుని
నీ మనసుతో
మనిషిగా చిక్కింది నన్ను మారమని
ఆ తగవులే చదువులై నేర్పాయి నాకు పాఠాలని
ఆ క్షణములే స్వరములై పాడాయి ప్రేమ పాటలని
ఏ గీతలేని కాగితంపై
ఈ రోజీ రాత రాసింది నువ్వే
ఏ రంగు లేని జీవితంపై
వర్షంలా వర్ణాలెన్నో చల్లేసేళ్ళావే

నువ్వే నా ధైర్యం
నువ్వే నా సైన్యం
నువ్వే నా ధైర్యం
నువ్వే నా సైన్యం



Credits
Writer(s): Shreemani, Ananth Sriram, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link