Vadhantune Nenu Vadhantune

వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా

కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగ
నాకు నచ్చావురా

ఉన్నమాటిది నిజమున్న మాటిది

అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా
ఆరాట పడుతోంది

నాలోనే ఉన్నా తెలియలేదు వేసడివే నీ అలజడి
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి
నీ వైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది

నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈరోజిలా
చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైన
గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా
వెన్నెల్లో నేనే నేను నిన్నిల ప్రేమిస్తున్న నీ మాయ దయ వలనా
I am in love baby
I am in love baby
I am in love baby
I am in love
I am in love baby
I am in love baby
I am in love baby
I am in love

నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టూ లోకం ఇల కనిపిస్తుంది
నీ జంట నడిచే అడుగు చూడు
గాల్లోన తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్దీ నీలో నేను కలిసే కొద్దీ
నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తుంది
నీ నీడలోనే నాకు ఆనందం ఉంది
నూరేళ్ళకు నేను నీలోన బందీ
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక
నీలోన సగమవనా

వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా

కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగ
నాకు నచ్చావురా
ఉన్నమాటిది నిజమున్న మాటిది

అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా
ఆరాట పడుతోంది



Credits
Writer(s): Ramajogayya Sastri, M Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link