Neevayasulu (From "Balaram Krishndu")

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచనీ
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచనీ
లాలిజో స్వరాలలో
వినీల మేఘమాల నీడలో
ప్రాణ వేణు ఊదుకున్న

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచనీ
వయసుకు చలివో
ప్రియ చెలివో తెలియదుగానీ
చిలకల కొలికి మనసిపుడు తెలుపవే
వలపుల వలవో ఒక కలవో ఎరుగదుగానీ
కనులలో వెలిగే కథలిపుడు తెలిసెలే
నీ లయా ఎదకే లయా
నీ దయా చెలి నీ దయా
కోకిలమ్మ పెళ్లి విందు
కొమ్మలన్నీ కోరుకున్న

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచనీ
ఒకరికి ఒకరై శృతి ఒకటై బ్రతుకొకపాటై
పలికిన జతకీ తొలిపలుకు వలపులే
మనసున మనసై ఒక మనిషై
మరువని తోడై
నడిచిన కథలో అడుగడుగు మమతలే
మల్లిలా విరిజల్లులా
వెల్లువో హరివిల్లువో
మోజులమ్మ రోజుకొక్క మేజువాణి చేసుకున్న

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచనీ
లాలిజో స్వరాలలో
వినీల మేఘమాల నీడలో
ప్రాణ వేణు ఊదుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచనీ



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Raj-koti
Lyrics powered by www.musixmatch.com

Link