Chamanti Pubanti (From "Chilakkottudu")

చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఆ... ఆ...

కొంచమైన తాళలేక పంచువున్న ఆశలన్ని
కంచె దాటున కసి తెంచి రేగునా
మించిపోయి అంచుదాటె తెంచలేని హాయినంత
పంచిపెట్టన రుచి పెంచి ఇవ్వనా
ఆ పొద్దు ఈ పొద్దు ఆపొద్దు నీ ముద్దు
దూరంగ పోవద్దు భామ
ఆలశ్యమేవద్దు ఏమాత్ర మాగొద్దు
ఈ హద్దులే వద్దు కామ
రావే... సొగసరి మరి మరి విరిసిన తొలి విరి
నీకే నేను కుదిరి అదిరి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే

ఆకుచాటు సోకులన్ని రేకువిప్పు వన్నెలల్లే
అందజేయనా జత పొందు చేరనా
ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చనైనా తేనే గోరుముద్ద లోనే పంచి
చంత చేరనా మరి కొంత కోరనా
జడ్లోన పూలన్ని పక్కల్లో రాలేటి
రాత్రిళ్ళకై నేను వేచా
కల్లోన ఓ కామ కల్లోలమే రేగి
కల్లారగ నేడు చూశా
ఏదో తెలియని అలజడి కలిగిన అలికిడి
నాలో కలలు కదలి మెదలి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ



Credits
Writer(s): Koti, Samavedam Shanmukha Sharma
Lyrics powered by www.musixmatch.com

Link