Tharagani Baruvaina

తరగని బరువైనా
వరమని అనుకుంటూ
తనువున మోసావే అమ్మా

కడుపున కదలికనై
కలవర పెడుతున్నా
విరివిగ పంచావే ప్రేమా
కనుతెరవక ముందే
కమ్మని నీ దయకు
రుణపడిపోయింది ఈ జన్మా
తందాని నానే తానితందానో
తానె నానే నో
హే నన్నాని నారె తానితందానో
తానె నానే నో

చితికిన బతుకులలో
చీకటి అడిగింది
వెతికే వేగు చుక్క ఎక్కడని
కుత్తుక తెగ నరికే
కత్తుల అంచులతో
దినమొక నరకంగా ఎన్నాళ్లని
అలసిన గుండెలలో
ఆశలు వెలిగించు
అండై నీతో వున్నానని

తందాని నానే తానితందానో
తానె నానే నో
హే నన్నాని నారె తానితందానో
తానె నానే నో
తందాని నానే తానితందానో
తానె నానే నో
హే నన్నాని నారె తానితందానో
తానె నానే నో



Credits
Writer(s): Ramajogayya Sastry, Ravi Basrur
Lyrics powered by www.musixmatch.com

Link