Aadavallu Meeku Joharlu - Title Song (From "Aadavallu Meeku Joharlu")

హే లక్ష్మమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఏందమ్మో
Egoలే చాలమ్మో
ఓలమ్మో pleaseఅమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో
నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అందానికేమైనా బాబా
చైలా కాపురం చైలా
కన్లా ఇద్దర్ని కన్లా
పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే knife-a
కానీ చైలా సంసారం చైలా
మీరు కన్లా ముగ్గుర్ని కన్లా
మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా
నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి
Foolలాగ మడిసెత్తారా

ప్రతి మొగాడి విజయం వెనక ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి ఎందరు ఆడాళ్ళు
ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా age friend-u పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి సెల్లమ్మేదని అనడా మరి అనడా
సాయంత్రమైతే సందు శివర పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని వెయ్ డా joke-uలు వెయ్ డా
మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తారా
నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి
ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా
ఎదురింట్లోన ఎంకయ్య తాతకి ఇద్దరు పెళ్ళాలు
అరె, లేనే లేదు నా తలరాతకి single-u ఇల్లాలు
ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపే పెళ్ళాం కావాలనుండదా
Dinner-u పెట్టి dreamsలోకి నెట్టే dream girl నాకు కావాలని పించదా
తన ఒళ్ళో వాలి ott చూడాలి అని నాక్కుడా ఉండదా
ఆకలి వేస్తే తనకో omelette వెయ్యాలనిపించదా నాకనిపించదా
మీరేమో మీ మొగుడు పండక్కికొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా
అరె గంతకి తగ్గ బొంతని సామెత మీరే సెబుతారే
నా range-uకి తగ్గా పిల్లని తెస్తే okay చెప్పరే
ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు



Credits
Writer(s): Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link