Suryudivo Chandrudivo (From "Sarileru Neekevvaru")

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరే హొయ్యా
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
విశ్వమంతా ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృషివో
మా అందరిలో ఒకడైన మనిషివో
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరే హొయ్యా

గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మండువేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం
పొలమారే ఆశల కోసం పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు
అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

దేవుడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో గొప్ప మనసు తనై
ఉంటాడు నీకు లాగా
ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు నిండారా పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నది
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరే హొయ్యా



Credits
Writer(s): Devi Sri Prasad, Darivemula Ramajogaiah
Lyrics powered by www.musixmatch.com

Link