Kannulake Kaanukave

కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే
పువ్వులనే నవ్వులనే
మించిన అందం నీదేలే
నీ నడిచే దారులలో
కాంతులు నీవేలే
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే

కనులను దాటి మనసుని తాకి
ఎదలను చేరే కధలవని
హో, నేనే నువ్వై నువ్వే నేనై
మెడలను తాకే ముడులవని
తీరాన్ని చేరే మన హృదయం
మాటల్లో పెరిగే మలి మౌనం
నాలోని ఊహలను కదిలించే బంధమా
నీవెంటే నేనంటూ సాగేటి రాగమా
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే

క్షణమే యుగమై నాలో సగమై
మాటలు చాలని పలుకవని
అదిరే పెదవై నిదురే కరువై
తనువుల తపనే మొదలవని
చీకటిని చేరే రవి కిరణం
ఊహల్లో దాగే తొలి ఉదయం
వీచేటి గాలుల్లో పిలిచేటి ప్రాణమా
నిను చేరే తరుణంలో
వేచున్న నేస్తమా

కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే



Credits
Writer(s): Hussain, Rap Rock Shakeel
Lyrics powered by www.musixmatch.com

Link