Darshana

మనసే మనసే తననే కలిసే
అపుడే అపుడే తొలి ప్రేమలోన
పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే
తనకా విషయం మరి చెప్పలేక
ఆగిపోయా కదా
ఎన్నో ఊసులు ఉన్నాయిలే
గుండే లోతుల్లో
అన్ని పంచేసుకుందామంటే
కళ్ళముందు లేదాయే దర్శన
దర్శన తన దర్శనానికింక
ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా
తట్టుకోడం కాదే నావల్ల
వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల
వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

ఇష్టమైంది లాగేసుకుంటే
చంటిపిల్లాడల్లాడినట్టే
దిక్కు తోచకుందే నాకు
నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే
నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే
దొరికెను పరిమళమే
చక్కగా చెట్టా పట్టా
తిరిగాం అట్టా ఇట్టా
అరె లెక్క పెట్టుకుంటే
బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
తట్టుకోడం కాదే నావల్ల
వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల
వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

దారులన్ని మూసేసినట్టే
చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే
నేను ఉన్నా లేనట్టే
చందమామ రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో
వెలుతురు కనబడదే
బెంగతో ఎలా ఎలా
పోయేలా ఉన్నానే పిల్లా
నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
ముట్టనులే నీమీదొట్టే

తట్టుకోడం కాదే నావల్ల
వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల
వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా



Credits
Writer(s): Chaitan Bharadwaj, Bhaskarabhatla
Lyrics powered by www.musixmatch.com

Link