Chukkalettu Kondale

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం

ఊరులెన్ని చూసుకో వారికో వీరికో
పేరు పెట్టుకోవడం ఖచ్చితం
ఎల్లలన్ని ఏకమై చేసినా సంతకం
వేవేల మైళ్లకైనా కాదు దూరం
పేదరాసి పెద్ద ముత్తైదువురా
సాధువురా ఈ ఊరే
చేసుకున్న పూర్వ పుణ్యముంటేనే
పుడతారే మా ఊరే
దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం

సరదా సంద్రంలా ఉంటారే
సర్దుకు పోతారే
సమయాసమయాలే లేకుండా
సాయం చేసే కుదురే
దిగులే దాటుకొని
స్థిరంగా నిలబడిపోతారే
కల్లాకపటాన్నే ఖండించి
నవ్వుతు గెలువగ పొగరే
ఈ యాసలో ఉందో కదరే
అరె వినరో భాగ్యంబిదికదరే
మీసాల సామి ఉన్న ఊరే
రోషాలకేమో మాది పెద్ద పేరే
ఊరు చూస్తే కొత్తకొత్తగుంటుందీ
ప్రతిసారి కంగారే
వింద వింద గోవిందా అనుకుంటూ
కష్టాలే దాటేరే

దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే
దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం



Credits
Writer(s): Chaitan Bharadwaj, Kalyan Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link