Hrudayam Kannulatho (From "100 Days of Love")

హృదయం కన్నులతో నిను చూసిందనుకో
రెప్పేపడదూ అనుకో
ఏదో హాయుందనుకో నను చూసిందనుకో
నాతో నీలానే ఉందనుకో
ఎవరూ లేరనుకో మనకోసం మనమనుకో
వింటూనే ఇల విరిసిందినుకో.అనుకో
కోయిల కుహులో కురిసే ఈ వెన్నెల్లో
ఇక నీ మౌనం చాలే
హృదయం కన్నులతో నిను చూసిందనుకో
రెప్పేపడదూ అనుకో
ఏదో హాయుందనుకో నను చూసిందనుకో
నాతో నీలానే ఉందనుకో

ఏదైనా అనుకో ఏమైనా అనుకో
సాగే ఏకాంతం చాలనుకో
నీడల్లే అనుకో నిజమల్లే అనుకో
ఒంటరి జంటే మనమే అనుకో
సిరిసిరిమువ్వై నా యదలో ఒక సడినే రేపావే
ఇన్నాళ్లు నే ఉన్నా ఊహల్లోనే
మంచ్చల్లే కురిశావే మనసంతా తడిపావే
విరబూసే గారాలు ఇక నువ్వే
ప్రేమే ఉంది అనుకో నిన్నే చేరిందని అనుకో
గాలే వీచననునుకో పువ్వుల్లా పూసామని అనుకో
ఒకటేగా అలకా నడిచే నడక ఇకపై ఒకటే అని అనుకో
కలలా కధలా రేయీ పగలా నీకై కరిగే నేననుకో
హృదయం కన్నులతో నిను చూసిందనుకో
రెప్పేపడదూ అనుకో
ఏదో హాయుందనుకో నను చూసిందనుకో
నాతో నీలానే ఉందనుకో
ఎవరూ లేరనుకో మనకోసం మనమనుకో
వింటూనే ఇల విరిసిందనుకో అనుకో
కోయిల కుహులో కురిసే ఈ వెన్నెల్లో
ఇక నీ మౌనం చాలే



Credits
Writer(s): Krishna Chaitanya, Govind Menon
Lyrics powered by www.musixmatch.com

Link