Yodhudaa (From "Pahalwan")

యోధుడా స్వాగతం
అందుకో ఆహ్వానం
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం
శక్తి పుంజుకో యుక్తి పెంచుకో
దేహమిది నీ ఆయుధమనుకో
గురి పెట్టావో ఛేదించాలి
తల పెట్టావో సాధించాలి
నీ జెండా ఎత్తుల్లో
ఎగిరేలా పోరాడాలి
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం

సొంత స్వార్థమై ఎంత ఆడినా
కొంత మేరకే గెలవగలమురా
పరుల కోసమై పాటుపడటమే
పరమార్థం
సెగలకోర్చిన సూర్య బింబమై
వెలుగు పంచుతూ ఎత్తుకెదగరా
నీలో కాంతికి జగతి నవ్వులే
నిలువద్దం
తాటి తగిలిన నాటి చరితల
పాత గతమిక రాదు
నేటి గమనమే నేటి పయనమే
నేటి సమరమే పోరాడు
గురి పెట్టావో ఛేదించాలి
తల పెట్టావో సాధించాలి
నీ జెండా ఎత్తుల్లో
ఎగిరేలా పోరాడాలి
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం

గెలిచే ముందుగా గెలుపుకు
వలసిన అర్హత సంపాదించు
విషమ పరీక్షలకందని
తీరుగ శిక్షణ కొనసాగించు
నిజమైన నీ తోడు ఎన్నడు
నీ ఆత్మ విశ్వాసమే
సరియైన మార్గాన కదిలితే
స్వప్నాలు సాఫల్యమే

గురి పెట్టావో చేధించాలి
తల పెట్టావో సాధించాలి
నీ జెండా ఎత్తుల్లో
ఎగిరేలా పోరాడాలి
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం



Credits
Writer(s): Ramajogayya Sastry, Arjun Janya
Lyrics powered by www.musixmatch.com

Link