Yevetti

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ
నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ
ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ
నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ
పాలతోనా. . నా
పూలతోనా. . నా
వెన్నతోనా. . నా
జున్నుతోనా. . నా
రంభ ఊర్వశి మేని చెమటతోనా. . నా
ఏవెట్టి. . ఏమెట్టి
టీ. . టీ. . టీ. . టీ
ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ
నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ

నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు
నేను మొక్కుకున్నా నీకు కన్ను కొట్టుకుంటానని. . నీ
నిన్ను కౌగిలించుకుంటానని. . నీ
నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు
నేను మొక్కుకున్నా నీతో సంధి చేసుకుంటానని. . నినీ
నీతో సందులోకి వస్తానని. . నినీ
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా
నీతో భాగస్వామినౌతాననీ
మూడు కళ్ళ శివుడికి మొక్కుకున్నా
నీతో మూడు రాత్రులవ్వాలనీ
ఆఖరికి
ఆఖరికి నీకే మొక్కుకున్నా
నీకు నౌకరుగా ఉంటానని
తీపి చాకిరులే చేస్తాననీ

ఏవెట్టి. . ఏమెట్టి
టీ. . టీ. . టీ. . టీ
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ
నిను మీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా. . నా
ఉగ్గుతోనా. . నా
నిప్పుతోనా. . నా
పప్పుతోనా. . నా
కాముడు పంపిన కోడి పులుసుతోనా. . నా

ఏవెట్టి. . ఏమెట్టి
టీ. . టీ. . టీ. . టీ
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ
నిను మీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ

నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో
ఒకటి చెప్పుకున్నా నిన్ను చూడగానే జారాలని. . నీ
ఆ మాట నోరు జారొద్దని. . నీ
నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో
ఒకటి చెప్పుకున్నా మేము అల్లుకుంటే చూడొద్దని. . నినీ
ఈ లొల్లి బయట చెప్పొద్దని. . నినీ
చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా
చిలిపి మాటలన్ని వినొద్దే అని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటేల మూగబొమ్మని నీ కన్నెతనానికే చెప్పుకున్నా
తనకేవేవో చెబుతానని అవి నీక్కూడా చెప్పొద్దని

ఏవెట్టి. . ఏమెట్టి
టీ. . టీ. . టీ. . టీ
ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ
నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link