Thrahimam Kreesthu Naadha

పల్లవి: త్రాహీ మాం క్రీస్తు నాధ దయ చూడ రావే
నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు ॥త్రాహి॥
నిన్ను జేరి సాటిలేని నిత్యానంద మందబోవు చున్నప్పుడు నిందలు
నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీవే నా మదికి ధైర్యమిచ్చి
రక్షించితివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ॥త్రాహి॥
గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నే నెంతో
నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాప రాశి
యివ్విధమున చెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ॥త్రాహి॥
నీ యందు భయభక్తులు లేని నిర్లచ్చాచిత్తము బూని
చేయరాని దుష్కర్మములు చేసినాడను
దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల (2)
చేయ సాగి నే నిబ్బంగి చెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ॥త్రాహి॥



Credits
Writer(s): Pranam Kamlakhar, Purushotam Chowdary
Lyrics powered by www.musixmatch.com

Link