Raajyahamsa

చిత్రం: శ్రీరాములయ్య (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో
రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

బీటవారిన బీడు భూమిలో ధుమ్ము రేపిన ఇసుక దుబ్బలు
ధారలై పారిన సెమటతో ధాన్య రాసుల శుద్ధిజేసిన
రైతు కూలి నాపై కక్ష కట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

లెక్కలేని పోలీసు మూకల మరతుపాకుల నిచ్చి పంపి
పచ్చని పల్లెల్లో పేదల బ్రతుకులో చితిమంట రేపుతు
చిత్రహింసలు పెట్టుతున్నారో ఏమెరుగనోళ్ల ఎదలపై గన్నులు మోపిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భర్తలను గుంజలకు కట్టి భార్యలను సెరబట్టి చెరిసిరి పచ్చి బాలింతలును కూడా పట్టితెచ్చి చెరలో బెట్టి
తల్లివడి కడబాపినారమ్మో నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భన్జరూసి భాయిజామా బలిసినోళ్ల మిగులు భూములు
పంచమని పేదోళ్లు ఒకటై చండబాపి చాండుగడితే
అరె బ్రతుకు చూపని దొరల రాజ్యంలో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

ఇన్ని హింసలు పెట్టి రాజ్యం ఎలెటోడని తింగ చూస్తాం
చెమట తీయని ఊరి దొరలను సేలకడుగు పెట్టనీయం
పెద్దరీకం చేసే కంతిరి గద్దలానిక తరిమి కొడతాం
గద్దలానిక తరిమి కొడతాం
ఆక్రమించిన దొరల భూమిలో అరక కట్టి సాల్ దోళుతాం
అరక కట్టి సాల్ దోళుతాం
డొక్కలల్లో గుండ్లు దిగినా దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link