Manase Eduru Tirige

మనసే ఎదురు తిరిగి మాటవినదు
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు

కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా అలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా నిజమైనా నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా

చినుకై కురిసినది కదా చిలిపి సరదా
అలలై ఎగసినది కదా వలపు వరద
మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link