Bombai Bomma

బొంబాయి బొమ్మ సూడరా
దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టెరు
బుజ్జాయి పెళ్ళి పనుల్లో
దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో
బొంబాయి బొమ్మ సూడరా
దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టెరు

షామియానా పరిచేస్తా పూలమేనా పిలిపిస్తా
పిండి వంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా
ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్
నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
అరి ఇంతకు నువ్వు ఎవరి తాలూకోయ్
నీ సిగతరగా
మాపై నీ జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా
నగలూ నట్రా తగిలిస్తా
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తా
లగ్గంలోని తతంగమే చేస్తా
అడుగులు ఏడు నడిపించేస్తా
పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్
నీ సిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్
నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్



Credits
Writer(s): Chandrabose, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link