Edo Edo

ఎదో ఎదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలైంది
నిన్నే చూడాలనీ
నీతో ఉండాలనీ
నేనే ఓడాలనీ
నువ్వే గెలవాలనీ
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతనా
అది ప్రేమే నేమో ఎరుగని కొంటె భావనా

కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చెయ్యి నీతో చెలిమి చెయ్యాలని తొందర పడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చెరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని
నీతో గడపాలని
నువ్వే ఇవ్వాలని
పొద్దె పోవాలని
మనసేమో మనసిచ్చిది వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతనా
అది ప్రేమే నేమో ఎరుగని కొంటె భావనా

ఎదో ఎదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలైంది

(సరిగరి సనిసనిపమ పామ మమపా సాగమాపరి
సరిగరి సనిసనిపమ పామ మమపాసారిగమాపా)

ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమి పాలు పోక సగ పాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని
నిన్నే కలవాలని
మనసే విప్పాలని
మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది
తుళ్ళింతా కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతనా
అది ప్రేమే నేమో ఎరుగని కొంటె భావనా

ఎదో ఎదో అయిపోతుంది (ఎదో ఎదో తెలియని వింత యాతనా)
ఎదలో ఏదో (అది ప్రేమే నేమో ఎరుగని కొంటె భావనా)



Credits
Writer(s): R.p. Patnaik, Kasi Viswanath
Lyrics powered by www.musixmatch.com

Link