Chinni Chinni

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది, సిరివెన్నెల జల్లింది
పువ్వు పువ్వున నవ్వులు చూసి
పున్నమి వచ్చింది, పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలిపొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు
ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది, సిరివెన్నెల జల్లింది

ఏ బ్రహ్మ రాశాడో పాశాలిలా, మారాయి స్నేహాలుగా
ఏ జన్మలో రక్తబంధాలిలా, ఈ రెండు దేహాలుగా
ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా
ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా
రాలేటి ఏ పూలరంగులో ముంగిళ్ళలో ముగ్గుగా
రోషాల ఈ లేతబుగ్గలో రోజాలు పూయించగా
ఆ బంధం అనుబంధం మాదే కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది, సిరివెన్నెల జల్లింది

ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా
ఈ కుర్రతిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా
ఆ మూతివిరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా
ఈ తిట్టిపోతల్లో అర్ధాలనే విలిగించుకో వీలుగా
కారాలు మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా
కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా
ఆ అందం ఆనందం మాది కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వున నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలిపొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు
ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది, సిరివెన్నెల జల్లింది



Credits
Writer(s): Veturi, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link