Muvvante Myna

మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన

మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన
మాట వరసకైనా తనకు చెప్పనంటూ
గీటు దాటకన్నా లెక్క చేయనంటూ
ఆమె గారి చెయ్యి జారి
మనసు గాని పారిపోయిందా
ఏమైనా రానందా రమ్మన్నా

మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన
సన్నాయిలా వినిపిస్తున్నవా
చెవి కొరికి పోయే చిరుగాలులు
జడివానలా అనిపిస్తున్నవా
జడ పూల చాటున తడి ఊహలు
ఇన్నాళ్లు నువ్వైనా చూసావటే
నీక్కూడ ముద్దొచ్చే అందాలు
ఇవ్వాళే నీకు తెలిసాయటే
ఛి పాడు అనిపించు అర్ధాలు
ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు
వచ్చిందే నీలోన
బాగుందే ఏమైనా

మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన
ఉయ్యాలకే ఉలుకొచ్చిందట
ఒళ్లోంచి నువ్ దిగి వెళ్లావని
పట్టీల అడుగే అలిగిందట
చెట్టెక్కడం మానుకున్నావని
పైటొచ్చి నీ జట్టు కట్టుకుందని
ఆటాడే ఈడింక చేరనన్నది
పారాణికేమంత బరువుందని
పాదాన్ని పరిగెత్తనీయకున్నది
గుండెలో గువ్వలా పెంచుకున్న
నిన్ను పిలిచిందే ఓ మేనా
పంపాలే ఏమైనా

మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన
మాట వరసకైనా తనకు చెప్పనంటూ
గీటు దాటకన్నా లెక్క చేయనంటూ
ఆమె గారి చెయ్యి జారి
మనసు గాని పారిపోయిందా
ఏమైనా రానందా రమ్మన్నా
మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Kamalakar
Lyrics powered by www.musixmatch.com

Link